Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి 

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి 

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం డివిజన్ నాయకులు తిరుపతయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి బోయలు రాజకీయ, ఆర్థిక రంగాలలో అభివృద్ధిని సాధించేందుకు ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు. వాల్మీకి బోయల ఎస్టీ రిజర్వేషన్ ను అమలు చేసుకునేందుకు చైతన్యమై పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వాల్మీకి సంఘం నాయకులు తిరుపతయ్య, శ్రీనివాసులు, బాలయ్య, పాండు, లక్ష్మీనారాయణ, రామనాథం, ఖాజా, శంకర్, మల్లేష్, శాంత కుమార్, పర్వతాలు, మధు, శేఖర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -