నవతెలంగాణ -ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో మంగళవారం ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. మహర్షి వాల్మీకి , తన గురువు బోధనల ద్వారా ప్రేరణ పొంది, ఆత్మశోధన ద్వారా మహానుభావుడిగా మారి, మనందరికీ ఆదర్శప్రాయమైన రామాయణం అనే గ్రంథాన్ని రచించారని అన్నారు. మన మనసు మారితే ఎవరైనా మహానుభావులుగా ఎదగగలరని తెలిపారు. ఆయన చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనిల్ ,మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ ,బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, నాయకులు జీవన్, టి. రమేష్ విట్టల్,సాయి ప్రసాద్,పోతన్న, గ్రామస్తులు విడిసి సభ్యులు ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముధోల్ లో ఘనంగా వాల్మీకి జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES