Tuesday, October 7, 2025
E-PAPER
Homeఖమ్మంఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి అని,  అటువంటి మహనీయుడు జయంతి ని ప్రతి ఏడాది జరుపుకోవటం ఆనందంగా ఉన్నదని పురపాలక సంఘ కమీషనర్ బి.నాగరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని తూర్పు బజార్ లోని వాల్మీకి దేవాలయం వద్ద నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయన ముఖ్యతిదిగా హాజరయ్యారు. వాల్మీకి ని దర్శించుకుని అనంతరం పతాక ఆవిష్కరణ గావించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ సంస్కృతంలో రామాయానాన్ని రచించి నిజాయితికి నిలువుటద్దమైన సీతారాముల వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని హుందాగా జీవించాలని ఆయన కోరారు.అదేవిదంగా పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబోతుల నాగు,ముసికి వెంకటరమణ, పాపారావు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -