Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అమూల్య 

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అమూల్య 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
రాజస్థాన్ రాష్ట్రంలో ఈ నెల 16 నుండి 21 వరకు జరుగుతున్న జూనియర్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు మగ్గిడి గ్రామానికి చెందిన అమూల్య ఎంపికైనట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు మధు సోమవారం తెలిపారు. అమూల్య గత నెల నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు సిరిసిల్లలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలో పాల్గొని అత్యున్నత ప్రదర్శన ద్వారా జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది. అమూల్య ఎంపిక పట్ల VFI (వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ హనుమంత్ రెడ్డి, జిల్లా వాలీబాల్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ , ట్రెజరర్ గంగారెడ్డి  , జిల్లా స్పోర్ట్స్ అధికారి పవన్  మగ్గిడి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు గ్రామ వీడిసి  గ్రామ ప్రజలు అమూల్య ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేసినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -