నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామంలోని మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలకు హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ శివారు భూక్య ధాన్య తండాకు చెందిన భూక్య వెంకన్న పిల్లల విద్యాభివృద్ధి కోసం ఒక వ్యాన్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఎంఈఓ రాందాస్ తెలిపారు. సోమవారం రూ.6 లక్షల 50 వేల విలువైన వ్యాన్ ను ఆ పాఠశాలకు సహకారంగా అందజేస్తున్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నుండి పాఠశాలకు రాకపోకలలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సౌకర్యార్థం మండల ప్రాథమికోన్నత పాఠశాల, పార్వతమ్మగూడెం కి ఒక వాహనం (వాన్) అందజేయబడింది అన్నారు.
ఈ వాహనాన్ని లైబ్రేరియన్ అధికారి వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ పుట్టి పెరిగిన మండలంలో విద్యార్థులు పాఠశాలకు రావడానికి పోవడానికి ఇబ్బందులు పడగవద్దని ఉద్దేశంతో భూక్యా వెంకన్న దాతృత్వంగా సమకూర్చడం జరిగింది అని తెలిపారు. ఈ వాహనం అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాల విద్యార్థులు సమయానికి పాఠశాలకు హాజరవుతూ..విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల విద్యార్థుల చదువుకు ఇది ఒక ప్రోత్సాహకరమైన అడుగుగా నిలుస్తుందని చెప్పారు.
ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం మా పాఠశాలకు ఒక వ్యాన్ ఇవ్వాలని అడిగారని, వెంటనే దాన్ని అందిస్తున్నామని అన్నారు. వెంటనే స్పందించిన భూక్య వెంకన్నకి ఆ పాఠశాల బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ హెచ్చు నరేందర్, ఉపాధ్యాయ బృందం ప్రవీణ్ నాయక్, వెంకటరత్నం, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



