Friday, January 2, 2026
E-PAPER
Homeకరీంనగర్వనజీవి రామయ్య జీవిత చరిత్ర డాక్యుమెంటరీ

వనజీవి రామయ్య జీవిత చరిత్ర డాక్యుమెంటరీ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
చెట్లే సమస్త జీవకోటికి ప్రాణదారంగా తలచి తన తుది శ్వాస వరకు మొక్కలు నాటుతూ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ వనజీవి రామయ్య ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో వనజీవి రామయ్య పేరుతో ఆయన జీవిత చరిత్రను పర్యావరణ పరిరక్షణ ఫిలిం బ్యానర్ పై, వనజీవి చిత్రంగా రూపొందిస్తున్న సినీ దర్శకుడు వేముగంటి, మరియు మ్యూజిక్ డైరెక్టర్ బల్లెపల్లి మోహన్ లు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  రాజన్న సిరిసిల్ల జిల్లా కోన రావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాష్ , ప్రకృతి బ్లెస్సి లకు నటించే అవకాశం లభించింది. కొమురవెల్లి గ్రామంలో  ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ లో జరుగగా  , ప్రకృతి ప్రకాష్ , ప్రకృతి బ్లెస్సి లు టైటిల్ రోల్ పోషిస్తున్న నటుడు బ్రహ్మాజీ పైకీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

కోటి మొక్కలు నాటి ప్రకృతి పేరు సాధించిన పద్మశ్రీ వనజీవి రామయ్య ను ఆదర్శంగా తీసుకొని , లక్షల విత్తనాలను విత్తన బంతులను అడవుల్లో డ్రోన్ల ద్వారా వెదజల్లి మొక్కలు నాటిన రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యావరణ ప్రేమికులు ప్రకృతి ప్రకాష్, ప్రకృతి బ్లేస్సి వనజీవి రామయ్య బాటలో నడుస్తూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం  నిరంతరం కృషి చేస్తున్నారువీరి కృషిని గుర్తించి వనజీవి బయోగ్రఫీ సినిమాలో వనజీవి సినిమా సినీ దర్శకులు వేముగంటి మరియు మ్యూజిక్ డైరెక్టర్ బల్లేపల్లి మోహన్లు సినిమాలో అవకాశం కల్పించారు. అరుదైన అవకాశం ను కల్పించిన  సినీ దర్శకులు వేముగంటి మ్యూజిక్ డైరెక్టర్ బల్లెపల్లి మోహన్ లు  ,ప్రకృతి ప్రకాష్ బ్లెస్సి లు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -