అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వనవీర’. సిమ్రాన్ చౌదరి హీరోయిన్. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ,’ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ. వచ్చే ఏడాదిని మేము ఒక బ్యాంగ్ లాంటి మూవీతో స్టార్ట్ చేయబోతున్నాం’ అని అన్నారు. ‘మా సినిమా టైటిల్‌కు సెన్సార్ ఒప్పుకోకపోవడం వల్ల ‘వనవీర’గా మార్చాం. అన్ని పర్మిషన్స్‌తోనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం.
అదే టైటిల్‌తో బాగా ఖర్చు పెట్టి ప్రచారం చేశాం. ఇందులో ప్రేక్షకులకు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. స్క్రీన్ మీద మా మూవీ చూస్తే ఒక పెద్ద సినిమాలా అనిపిస్తుంది. చిన్న సినిమా అనే ఫీల్ రాదు’ అని నిర్మాత శంతను పత్తి చెప్పారు. అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ, ‘ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. సీజీ వర్క్ చాలా క్వాలిటీగా చేశారు. అవినాష్ హీరోగానే కాదు దర్శకుడిగానూ మారి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ శంతను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు’ అని తెలిపారు. హీరో, డైరెక్టర్ అవినాష్ తిరువీధుల మాట్లాడుతూ,’రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. మైథాలజీ టచ్ ఉంటుంది. మా సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఒక హిట్ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. మా సినిమా నిరాశపర్చదు అనే కాన్పిడెంట్‌తో ఉన్నాం’ అని అన్నారు.
‘వనవీర’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



