Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమకారులకు వందేమాతర గీతం స్ఫూర్తి

ఉద్యమకారులకు వందేమాతర గీతం స్ఫూర్తి

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తిని ఇచ్చిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గుర్తు చేశారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బందితో కలిసి సామూహికంగా వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమైక్యంగా ఆలపించడం ఎంతో గర్వకారణంగా ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. 150 సంవత్సరాలుగా మన సమిష్టి జీవనంలో అంతర్భాగంగా ఉన్న ఈ గీతం భావి తరానికి సైతం స్పూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బంది గీతాలాపన చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -