– హెచ్.యం. పరుచూరి హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
భారత జాతి ఔన్నత్యాన్ని తెలిపే గేయం వందేమాతరం అని, ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని తన ఆనంద మఠం నవలలో 1875 లో రచించారని, బెంగాల్ విభజన సమయంలో వందేమాతరం క నినాదంగా ప్రారంభమై దేశ స్వాతంత్ర్యాన్ని సాధించే ఉపకరణంగా పని చేసిందని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. శుక్రవారం పాఠశాలలో వందేమాతరం 150 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వందే మాతరం గీతం లోని ఒక చరణాన్ని మాత్రమే మనం ప్రతి రోజు ఉచ్ఛరిస్తామని దులో 5 చరణాలు దేశభక్తిని పెంపొందిస్తాయి అని మన జాతి గొప్పతనాన్ని ఐక్యతను ఇందులో రచయిత పొందుపర్చారని అన్నారు. ప్రతీ విద్యార్ధి దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు.
ఉదయం పది గంటలకు విద్యార్ధులు, ఉపాధ్యాయులు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. విద్యార్ధులకు వందేమాతరం పై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని స్మార్ట్ టి.వి.ల ద్వారా చూపించారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, ఉపాధ్యాయులు,విద్యార్ధులు పాల్గొన్నారు.



