నవతెలంగాణ-చిన్నడూరు
శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి అమ్మవార్లను గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిష్టపూర్ గ్రామంలో యువత పెద్ద ఎత్తున వంగ రాజేశ్వర్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ సమ్మక్క సారలమ్మ లను వేడుకోవడం జరిగింది. జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కవిత లక్ష్మణ్, మాజీ యంపిటిసి గొల్లపల్లి లచ్చయ్య, ఐలయ్య, తిరుపతి, వార్డు మెంబర్ అంజి, లహరి ఫౌండేషన్ కమలాకర్, మాజీ ఎఎంసి డైరెక్టర్ ఎర్రవెల్లి ముత్తయ్య, శానకొండ రాజు, కుంబాలశెఖర్, తదితరులు పాల్గొన్నారు.



