Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వంజరీలను వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలి

వంజరీలను వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలి

- Advertisement -

–  పంచాయతీ కార్యాలయం ముందు నల్ల జండాలు, బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వంజరి కులస్తులను వెంటనే ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని వంజరి సంఘం మండల అధ్యక్షులు అమందు అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కోన సముందర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వంజరి కుల సంఘం సభ్యులు నల్ల జండాలు, బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంజరి సంఘం మండలం  అధ్యక్షులు అమందు అశోక్  మాట్లాడుతూ బంజారా లుగా పిలవబడే వంజరి కులాన్ని 1977లో 245జీవో ద్వారా వంజరి కులస్తులను ఎస్టీ జాబితాలో కలపడం జరిగిందన్నారు.

రెండు సంవత్సరాలు గడవక ముందే చిన్నారెడ్డి ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 44 ద్వారా  వంజరి కులస్తులను బీసీ కులాల జాబితాలోకి మార్చడం జరిగిందన్నారు. దీని ద్వారా వంజరి కులానికి చెందిన విద్యార్థులకు చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా అన్యాయం జరుగుతుందన్నారు. దీంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 23న బ్లాక్ డే గా  వంజరి కులస్తులం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 44 ను తొలగించి యధావిధిగా వంజరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ భలేరావు శంకర్, వంజరి సంఘం కార్యదర్శి గడ్డం మహేష్, మాజీ వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, మాజీ ఉపసర్పంచ్  పేరం లింబాద్రి, కొండ నరేష్, భలే రావు ప్రశాంత్, రమేష్, వంజరి కుల సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -