నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా శుక్రవారం మహిళలు హైందవ సంప్రదాయం ప్రకారం వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ప్రత్యేకంగా జరిగే ఈ వ్రతం కోసం ఉదయం నుంచే ఆడపడుచులు మంగళ స్నానమాచరించి, ఇళ్లలో పండగ. వాతావరణం నెలకొల్పారు. నియమ నిష్ఠలతో వరలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలతో పూజలు జరిపారు.
పూజ అనంతరం సాటి ముత్తయిదువులను పిలిచి కుంకుమ, గాజులు, కాసులు, ప్రసాదాలు, వాయినాలను ఇచ్చిపుచ్చుకునే ఆనవాయితీ కొనసాగింది. సుమంగళిగా దీర్ఘకాలం ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి అని పెద్దలు చెబుతారు. సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు ప్రసాదమవుతాయని హిందువుల విశ్వాసం. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాలన్నీ భక్తిరసంతో మునిగిపోయాయి.
ఘనంగా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES