Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరలక్ష్మి వ్రతం 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరలక్ష్మి వ్రతం 

- Advertisement -

పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం వేడుకల్లో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం నిర్వహణ కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రంగురంగుల పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహిళల్లో ఐక్యతను పెంపొందించేందుకు వరలక్ష్మి వ్రతం దోహదపడుతుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అన్నారు. వరలక్ష్మి వ్రతం అనంతరం మహిళలకు తాంబూలాలను, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -