Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకులలో వసంత పంచమి వేడుకలు

గురుకులలో వసంత పంచమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
సంగీతాది లలిత కళలకు సరస్వతీ మాత ఆదిదేవతయని, సంస్కృత భాషా ప్రచార సమితి నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి వ్యాఖ్యాత డా బి.వెంకట్ అన్నారు. తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో వసంతపంచమీ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి విగ్రహానికి నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పసుపు కుంకుమ, పూలతో అర్చించారు. ఇంజనీర్, డాక్టర్, లాయర్, డ్యాన్సర్, గాయకుడు, ఉపాధ్యాయుడు కవులుగా, పాత్రికేయులుగా, కళాకారులుగా, అన్ని రంగాల్లో రాణించాలంటే సరస్వతీ అమ్మవారి అనుగ్రహము ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ సరస్వతీ మాతను కొలవాలన్నారు. ఉపాధ్యాయులు- బి.సుమన్, జే.గణేశ్ , జి.రాము, సంతోష్, రాచప్ప, నరహరి, కే.నరేశ్ , కే.బస్వరాజు, సాయిలు, హన్మాండ్లు, పి.శంకర్, యస్ శంకర్,ఫ్రేం సింగ్ ,విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -