- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ లో శుక్రవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారుల సామూహిక అక్షరాభ్యాస వేడుకలకు స్కూల్ ఆవరణలో చిన్నారులకు చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం, ప్రవీణ్ శర్మ పండితులు మంత్రోచ్చరణల మద్య అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ బొట్ల రవిన్ ప్రసాద్, ప్రిన్సిపాల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -


