Monday, June 23, 2025
E-PAPER
Homeఖమ్మంవాసవి క్లబ్ ఆద్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు

వాసవి క్లబ్ ఆద్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : వాసవి క్లబ్ అశ్వారావుపేట మండల కమిటీ ఆద్వర్యంలో మండలంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేదాంత పురం పంచాయితీ నల్లబాడు కు చెందిన సైనికుడు బాపిరాజు తల్లిదండ్రులు ఏపుగంటి శ్రీనివాసరావు,లక్ష్మీ రాజేశ్వరి లను సత్కరించారు. ఆసుపాక ఎంపీయూపీఎస్ విద్యార్ధులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పొట్టి శ్రీనివాస్, ఐపీసీ అత్తులూరి పురుషోత్తమ రావు,రీజనల్ చైర్మన్ భోగవల్లి రాంబాబు, వాసవి క్లబ్ అశ్వారావుపేట ప్రెసిడెంట్ సత్యవరపు బాలగంగాధర్,కుమార్ రాజా,జల్లిపల్లి దేవ రాజ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -