నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రంలో ఆర్యవైశ్యులకుల దైవం, కలియుగ దైవం ఆర్యవైశ్యుల ఆడపడుచు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నుంచి ఉదయం బైక్ ర్యాలీలతో వెళ్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించే చోట వాసవి జెండా ఆవిష్కరణ చేసి, వేద బ్రాహ్మణులచే పూజలు నిర్వహించారు. అనంతరం వైశ్య భవనం పునర్మాణంలో భాగంగా పుణ్యా వచన కార్యక్రమం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము, కుంకుమార్చన, సత్యనారాయణ వ్రతం, శ్రీవాసవికన్యకా పరమేశ్వర అమ్మవారి జీవితచరిత్ర, వాసవిమాత పారాయణం, సౌందర్యలహరి, లలిత సహస్రనామాలు, అన్న ప్రసాద వితరణ చేశారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవ విగ్రహంతో వీధుల గుండా రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెజగం సంతోష్, బొంపల్లి రాజులు, తాటి మధుసూదన్, తాటి విశ్వేశ్వర్, తాటి లింగమూర్తి, కొత్త శ్రీనివాస్, కొక్కొండ మహేష్, పత్తి శ్రీధర్ ,తోట ప్రశాంత్ కుమార్, గౌరిశెట్టి బాలరాజు, బెజగం ప్రవీణ్, పత్తి లక్ష్మీ కాంత్, తాటి దినేష్ కుమార్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వాసవిమాత జయంతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES