– ఫిక్కీ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఫిక్కీ నెట్ జీరో ఫోరం సదస్సులో భారత క్లీన్ ఎనర్జీ లక్ష్యాలపై విస్తృతంగా చర్చించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన భారత్ 150 గిగావాట్ సౌర విద్యుత్ సామర్థ్యంతో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరిందని, రాబోయే నాలుగేండ్లలో ఈ రంగం 51 లక్షల గ్రీన్ జాబ్స్‌ను సృష్టిస్తుందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ రంగంలో విస్తృతావకాశాలు ఉన్నాయ న్నారు. మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సుమారు 50-55 శాతం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తోం దన్నారు. ఫిక్కీ నెట్ జీరో ఫోరం పెట్టుబడులు ఆకర్షించడంలో, భాగస్వా మ్యాలను పెంపొం దించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. సోలార్ వాహనాల వల్ల ప్రయాణ ఖర్చు కిలో మీటరుకు కేవలం 60 పైసలకు తగ్గుతుందని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ వివరించారు. పర్యావరణ హిత ఇంధన వనరుల దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ఈ సదస్సు స్పష్టం చేసింది.
క్లీన్ ఎనర్జీలో విస్తృతావకాశాలు
- Advertisement -
- Advertisement -



