Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'ఉపాధి'కి తూట్లు పొడిచేందుకే 'వీబీ జీ రామ్‌ జీ'

‘ఉపాధి’కి తూట్లు పొడిచేందుకే ‘వీబీ జీ రామ్‌ జీ’

- Advertisement -

సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేందుకే మోడీ సర్కార్‌ దాని స్థానంలో ‘వీబీ జీ రామ్‌జీ’ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రాలపై 40శాతం భారం మోపడం, వాటిని ఖర్చుచేస్తేనే కేంద్రం నిధులను విడుదల చేస్తామని మెలిక పెట్టడం దుర్మార్గమని అన్నారు. రూ. 28 లక్షల కోట్లను సంపన్న కుటుంబా లకు పారుబకాయిల పేరుతో మోడీ ప్రభుత్వం ఖర్చు చేసిందనీ, అదే సమయంలో పేదలకు తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ అనుకూల బిల్లులు పాస్‌ చేయించుకుంటున్నారని ఎత్తిచూపారు. వెనిజులా అధ్యక్షుడిని చంపుతానని ట్రంపు బెదిరించడం దుర్మార్గమని తెలిపారు. టారిఫ్‌ల పేరుతో సుంకాలను అమెరికా పెంచుకుంటూ పోతున్నా ఆ దేశానికి అనుకూలంగా మోడీ వ్యవహరించడం తగదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నివేదిక ప్రవేశపెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -