Wednesday, December 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు'వీబీ జీ రామ్‌ జీ' ని రద్దు చేయాలి

‘వీబీ జీ రామ్‌ జీ’ ని రద్దు చేయాలి

- Advertisement -

నిధులు ఎగ్గొట్టేందుకే కేంద్రం కుట్ర
ఉపాధి హామీ చట్టంలో మార్పులపై వామపక్షాల నిరసనలు
నవతెలంగాణ-విలేకరులు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేస్తూ వీబీ జీ రామ్‌ జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పలు జిల్లాల్లో వామపక్ష పార్టీలైన సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, ఏఐఎఫ్‌బీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన సెంటర్‌లో జీవో కాపీలను దహనం చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో అశోక్‌ టాకీస్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. గద్వాలలో సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. కరీంనగర్‌లోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై బిల్లు ప్రతులను దహనం చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో బిల్లు ప్రతులను దహనం చేశారు. హుజూర్‌నగర్‌లో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -