Tuesday, February 3, 2026
E-PAPER
Homeజిల్లాలువీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి

వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విబి–జి రామ్ జి చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కుంట్లగూడెం గ్రామంలో ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని ప్రదేశంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. వామపక్ష పోరాట ఫలితంగానే యూపీఏ-1 ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసినట్లు గుర్తుచేశారు. ఈ చట్టం గ్రామీణ పేదలకు ఉపాధి భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు.

ప్రస్తుత బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు గ్రామీణ ధనిక వర్గాలకు అనుకూలంగా కొత్త విధానాలు తీసుకువస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను తక్షణమే నిలిపివేయాలని, గ్రామీణ కూలీల జీవనాధారాన్ని రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వ్యవసాయ కార్మిక జిల్లా కమిటీ సభ్యులు మానే సాలయ్య, కంచర్ల రాజు, కంచర్ల ముఖేష్, మలబోయిన శివకుమార్, గువ్వల ప్రశాంత్, పిన్నింటి రాజమ్మ, జంగిలి పెంటమ్మ, కంచర్ల వసంత, గువ్వల ఎల్లమ్మ, పిన్నింటి చంద్రకళ, కంచర్ల రూపమ్మ, కంచర్ల అనుప్రియ, బలమైన సుగుణమ్మ, కంచర్ల అక్షయ, కంకల మల్లమ్మ, ఎడ్ల సుశీల, గువ్వల అనసూయ, బందెల లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -