Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిజామాబాద్ లో ఘనంగా వీసిఏ, పీసీఏ 

నిజామాబాద్ లో ఘనంగా వీసిఏ, పీసీఏ 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 6న జరుపుకునే వాలంటరీ కస్టమర్ అసోసియేషన్ (వీ.సి.ఏ ) , ప్రొఫెషనల్ కస్టమర్ యాక్టివిస్టుల ( పీ.సీ.ఏ ) డే ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ప్రముఖ వైద్యులు (విష్ ఫర్టిలిటీ ) డాక్టర్ టి.కిరణ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య సిసిఐ తెలంగాణ,ఆల్ ఇండియా కన్జ్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిసిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్, ఏఐసిడబ్ల్యూసి రాష్ట్ర కార్యదర్శి రాజుల రామనాథం,సౌత్ ఉపాధ్యక్షులు తంగనపల్లీ శ్రీనివాస్, ఇందర్ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు పెందొట అనిల్ వీరి ఆధ్వర్యంలో వీ.సి.ఏ & పీ.సీ.ఏ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. 

 ఇందర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యం లో వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధుల తో సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి ఏటా సెప్టెంబర్ ఆరవ తేదీన నుండి 9 వ తేది వరకు దేశవ్యాప్తంగా వాలంటరీ కన్జ్యూమర్ అసోసియేషన, మరియు ప్రొఫెషనల్ కన్జ్యూమర్ ఆక్టివిస్తుల, సంక్షేమం కోరుతూ వీ.సి.ఏ & పీ.సీ.ఏ. డే  నిర్వహించడం కోసం జాతీయస్థాయిలో ఒక కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది.

ఆ కమిటీ ఆదేశానుసారం దేశవ్యాప్తంగా వినియోగదారుల సంఘాలు ఈ రోజున జరుపుకుంటూ సీనియర్ కన్స్యూమర్ యాక్టివిసులు నిర్వహించడం జరుగుతుంది. సిసిఐ తెలంగాణ, ఏఐసిడబ్ల్యూసి, తదితర ఈ సమావేశంలో సిసిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్, ఏఐసిడబ్ల్యూసి రాష్ట్ర కార్యదర్శి రాజుల రామనాథం,సౌత్ ఉపాధ్యక్షులు తంగనపల్లీ శ్రీనివాస్, ఇందర్ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు పెందొట అనిల్, ఉపాధ్యక్షులు వి.ఎన్. వర్మ, జిల్లా సంయుక్త కార్యదర్శిలు , మహాదేవుని శ్రీనివాస్, నరసింహ చారి, తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగినది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad