నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దుర్గాదేవి మండపం వద్ద కుంకుమపూజ, యజ్ఞ హోమం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్గాదేవి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే మహఅన్నదానం ఏర్పాటు చేయించిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్, మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి గోపి ముదిరాజ్ లకు గ్రామ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఇమ్మడి గోపి ముదిరాజ్ మాట్లాడుతూ.. స్వాములకు, గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేయాలని అనుకోని ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. ఇంక చాలా చేయాలని ఉందని స్వాములకు అవసరం అయిన వాటిని త్వరలోనే సమకుర్చుతనన్నారు.విడిసి సభ్యులు ఇమ్మడి గోపి ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందుగా దేవి మాత విగ్రహా దాతా సాకలి గంగాధర్,శేట్టి చిన్న గంగారం లకు సన్మానించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి కుంకుమ పూజలో పాల్గొని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ సురేశ్, నిఖిల్, జర్గు ఒడ్డెన్న,అన్నారం శ్రీనివాస్, కుర్మా ప్రకాశ్, కుర్మా ఒడ్డెన్న, డిపు సాగర్, యదగౌడ్, గండ్ల ధర్మయ్య, ప్రశాంత్, కిశోర్, చిన్న సాయిలు, గౌరవ అధ్యక్షులు దర్శపు గంగాధర్, మేకల శేఖర్ తోపాటు మహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.