Wednesday, April 1, 2026
E-PAPER
Homeబీజినెస్అదానీపై వేదాంత పోరు

అదానీపై వేదాంత పోరు

- Advertisement -

జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ ఆస్తులపై సుప్రీంలో కేసు
న్యూఢిల్లీ:
దిగ్గజ పారిశ్రామిక వేత్తలు గౌతమ్‌ అదానీ, అనిల్‌ అగర్వాల్‌ మధ్య వివాదం ముదు రుతోంది. సుమారు 4 బిలియన్‌ డాలర్ల (రూ.33,000 కోట్లకు పైగా) విలువైన దివాలా ఆస్తుల కోసం సాగుతున్న పోరు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. దివాలా తీసిన జైప్రకాశ్‌ అసోసియేట్స్‌కు చెందిన సిమెంట్‌ ప్లాంట్లు, విద్యు త్‌ కేంద్రాలు, దేశంలోని ఏకైక ఫార్ములా వన్‌(ఎఫ్‌1) ట్రాక్‌ను దక్కించుకునే క్రమంలో అదానీ గ్రూప్‌ గెలిచిన బిడ్‌ను సవాలు చేస్తూ వేదాంత అధినేత అనిల్‌ అగర్వాల్‌ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. తాము 1.8 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.16,880 కోట్లు) గరిష్ట బిడ్‌ ను దాఖలు చేసిన ప్పటికీ.. కేవలం 1.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.14వేల కోట్లు) ప్రతి పాదించిన అదానీ గ్రూప్‌ బిడ్‌లో ముందస్తు నగదు చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో వారిని విజేతగా ప్రకటించడాన్ని వేదాంత తప్పుబడుతోంది. నిబంధ నలను పక్కనపెట్టి అదానీకి అనుకూలంగా బిడ్‌ను కట్టబెట్టడం స్పష్టమైన అశ్రిత పక్ష పాతమే అనే కోణంలో అనిల్‌ అగర్వాల్‌ న్యాయపోరాటానికి దిగారు. రుణదాతల కమిటీ, ట్రిబ్యునల్‌ అదానీ వైపు మొగ్గు చూపడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం గరిష్ట లాభాన్ని చేకూర్చే బిడ్‌ను కాదని, తక్కువ మొత్తానికి ఆస్తులను కట్టబెట్టడం పారదర్శక తను ప్రశ్నిస్తోందని వేదాంత వాదిస్తోంది. ఈ వేలం ప్రక్రియ జరిగిన తీరు సరైనది కాదని.. తక్కువ ధరకే అదానీకి కీలక ఆస్తు లను అప్పగించడం ద్వారా రుణ దాతల ప్రయోజనాలను దెబ్బ తీశారని అగర్వాల్‌ తన సోషల్‌ మీడియా వేదికగా పరోక్షంగా ధ్వజమెత్తారు. నిజానిజాలను మేము న్యాయస్థానం ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేయడం ఈ కేసులోని తీవ్రతను తెలియజేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -