నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జల్ సంచాయ్ జన్ భాగీదారీ కేంద్ర జల శక్తి శాఖ పురస్కారం అందుకుని ఆదిలాబాద్ కు వచ్చిన కలెక్టర్ రాజర్షి షాను సనాతన హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేదపండితులతో ఆశీర్వాచనలు అందించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశీర్వాచనలను వేదపండితులు అందించారు. ఈ సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి లో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇలాంటి కలెక్టర్ మన జిల్లా కు లభించడం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు బండారి వామన్ , కోశాధికారి రేణుకుంట రవీందర్, కార్యనిర్వహక కార్యదర్శి కందుల రవీందర్, సంతోష్ అగర్వాల్, దశరథ్, సంధ్య రాణి, వేదపండితులు సంతోష్ శర్మ వారి బృందం పాల్గొన్నారు.
ప్రజాఆరోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇదిలా ఉంటే అటూ అవార్డు తీసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజాఆరోగ్య ఉద్యోగుల సంఘం హెచ్1 ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువ, పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అల్లాడి రాఘురాం రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ. నాయకులు వెంకటరమణ, నవీద్ మోసిన్, దేవిదాస్, దయాకర్ పాల్గొన్నారు.



