నవతెలంగాణ – మునుగోడు
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని వెదిరె పూలమ్మ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్న ఆశా స్కాలర్షిప్ కు ఎంపికైన లక్ష్మీ ప్రసన్న, యామిని సరస్వతిని శాలువాతో సన్మానం చేసి అభినందించారు. అనంతరం బాల చెలిమి పిల్లల వికాస సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి బాలల కథల పోటీలో “చిలుక పెంపకం” అనే కథనాన్ని రాసి జాతీయ కథల పోటీకి ఎంపికైన దాం శ్రీవల్లికి ఐదువేల 5 వేలు , చిత్రలేఖనంలో ప్రతిభను ప్రదర్శించిన పి నిఖిల్ కి ఐదు వేల వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి సహకారంతో పౌండేషన్ వైస్ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి విద్యార్థులకు అందించి, శాలువాతో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో నిఖిల్ చిత్రలేఖన విషయంలో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొంటే దానికి కావలసిన ఆర్థికపరమైన ఖర్చులకు, చిత్రలేఖనంకు కావలసిన మెటీరియల్ ను వెదిరె పూలమ్మ ఫౌండేషన్ అందిస్తుందని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడపూర్ వెంకటనారాయణ , మొగుదాల శ్యామల , మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ , గ్రామ ప్రజలు ,మక్కెన అప్పారావు , జీడిమడ్ల యాదయ్య , జీడిమెట్ల రవీందర్ , సంకు శంకర్ , వడ్డేపల్లి దుర్గాప్రసాద్ , ఉపాధ్యాయుల బృందం గ్రామ వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.



