Monday, March 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలువీరభద్ర స్వామి గుడి హుండీ దొంగిలింపు

వీరభద్ర స్వామి గుడి హుండీ దొంగిలింపు

- Advertisement -

ఆలస్యంగా వెలుగులోకి ..
నవతెలంగాణ – నవాబు పేట
మండల పరిధిలోని లోకిరేవు గ్రామ సమీపంలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న హుండీ గత కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. అనంతరం అందులో ఉన్న కానుకలను తీసుకుని ఓ ప్రాంతంలో పడేశారు. స్థానికులు గమనించి హుండీ దొంగిలించిన విషయం గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో ఆలయ ప్రధాన అర్చకులకు తెలుపగా యధాస్థానంలో ఉంచినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఈ విషయం పై సంబంధించిన పూజారులు, పెద్దలు ఎవరు కూడా హూండి దొంగతనం విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అంటున్నారు. అయితే హుండీ దొంగిలింపు జరిగిన విషయం రహస్యంగా ఉంచడం ద్వారా కొందరు గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇలా హుండీ పై ఎలాంటి ఫిర్యాదు చేయకపోతే ఇక మున్ముందు పెద్ద దొంగతనాలు జరిగితే బాద్యులెవరని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -