- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గురువారం విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా శాస్త్రోతంగా పూజలు, హోమాలు చేశారు. కామారెడ్డి శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం ప్రతిష్టాచార్యులు శీర్లవంచ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం విగ్రహాల ప్రతిష్టాపన ధ్వజస్తంభ స్థాపన చేపట్టారు. గోవిందమాంబా, వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం, అభిషేక పూజలు చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కుల సంఘం పెద్దమనుషులు, సభ్యులు, వీడిసి ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



