నవతెలంగాణ – గోవిందరావుపేట
కన్నాయిగూడెం జెడ్పిటిసి బరిలో పద్మ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య చక్రం తిప్పనున్నారని అభిమానులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత వీరయ్య మళ్ళీ ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతున్నారని అంటున్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్టీ మహిళలకు రిజర్వ్ కావడంతో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా వీరయ్య సతీమణి పద్మ నీ కన్నాయిగూడెం మండలం నుండి జడ్పిటిసి బరిలో దింపనున్నారని పేర్కొంటున్నారు. కన్నాయిగూడెం జడ్పిటిసి స్థానం ఎస్టి మహిళకు రిజర్వ్ కావడంతో ఆస్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ గా తన రాజకీయ ప్రభావాన్ని పునరుద్ధరించుకొనున్నట్లు ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాక జనరల్ మహిళలకు పరిమితమైన మంగపేట స్థానం నుంచి కూడా పోటీ చేయవచ్చన్న అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వీరయ్య ములుగు నియోజకవర్గ పరిధిలో పోటీ చేసిన ప్రతిసారి మీరే సతీమణి పద్మ ప్రచారం లో ముమ్మరంగా పాల్గొని ప్రజలందరికీ సుపరిచితురాలుగా పరిచయమయ్యారు. సుమారు 8 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత ములుగు రాజకీయాల్లోకి వీరయ్య రావడం ఇంతకాలం స్తబ్దతగా ఉన్న వీరయ్య అనుచరుల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని చెబుతున్నారు. ఇకపై మాకు కూడా మంచి రోజులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని తెలుపుతున్నారు. ఇదే జరిగితే వీరయ్య గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసి విజయం సాధిస్తామని అంటున్నారు.
నియోజకవర్గంలో వీరయ్య చేసిన సేవలు పనులు పలు నిర్మాణాలు రహదారులు ప్రజాదరణ ఇంకా చెక్కుచెదరలేదని, నిష్కలంకమైన ప్రజా నాయకుడిగా వీరయ్యకు చెరగని ముద్ర ఉందని అంటున్నారు. జిల్లా రాజకీయాల్లో వీరయ్య ఆగమనం ములుగు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన శకానికి దారితీస్తుంది అన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.