పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆ అంచనాలకు తారాస్థాయికి తీసుకెళ్ళేలా.. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ త్వరలో విడుదల కాబోతుంది. అంతేకాదు, చిత్ర విడుదల తేదీని కూడా తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన నాటకీయత, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వెండితెరపై గొప్ప అనుభూతిని కలిగించనుంది అని మేకర్స్ తెలిపారు.
జూలై 24న ‘వీరమల్లు..’ రిలీజ్
- Advertisement -
- Advertisement -