- Advertisement -
పోరాట స్ఫూర్తిని గుర్తుచేసిన రజక సంఘం నాయకులు
నవతెలంగాణ – ఉప్పునుంతల
వీర వనిత ఐలమ్మ 40 వ వర్ధంతి సందర్భంగా ఉప్పునుంతల మండల కేంద్రంలోని పోచమ్మ చౌరస్తా వద్ద ఉన్న ఆమె విగ్రహం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకుడు కాశన్న, అచ్చంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్, పాలసీతలీకరణ కేంద్రం మాజీ చైర్మన్ కట్ట గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు, అడ్వకేట్ కృష్ణయ్యతో పాటు రజక సంఘం నాయకులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -