- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామ సర్పంచిగా ఇటీవల ఎంపిక అయిన ఎత్తారి మాధవి సాయిలు, గురువారం స్థానిక ఎస్సై కే. చంద్రమోహన్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానం జరిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి పై దృష్టి సారించాలని, గ్రామంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎత్తారిసాయలు, రాజా గౌడ్, రమేష్ గౌడ్, ఎత్తారి సాయిలు, పోచమల్లు, సత్యా గౌడ్, గంగాధర్ గౌడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



