నవతెలంగాణ – గోవిందరావుపేట : వీరపనేని శివాజీ ఐదవ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలో శనివారం శ్రేయోభిలాషులు మిత్రులు కుటుంబ సభ్యులు  శివాజీ  విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ అత్యంత సన్నిహితులు  సూరపనేని నాగేశ్వరరావు, తలసిల వెంకటేశ్వరరావు , మరియు మిత్రబృందం వీరపనేని విగ్రహం వద్ద  శివాజీ  జీవన ప్రస్థానం, పుస్తకాలను ఆవిష్కరించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ శివాజీ  విగ్రహం వద్ద ప్రజలకు  పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు.
 అనంతరం గ్రామంలో పాఠశాలల్లో  విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరపనేని శివాజీ సన్నిహితుడు  సురపనేని నాగేశ్వరావు  మాట్లాడుతూ.. శివాజీ  గోవిందరావుపేట మండలానికి  చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఆయన ఎప్పుడూ పేద ప్రజల కోసం ఆలోచించేవాడని తెలిపారు. గ్రామంలో నిరుపేదలకు 500 ఇల్లు మంజూరు చేయించి, కట్టించిన ఘనత శివాజీది అని అన్నారుప. వీరపనేని కుటుంబం ఇప్పటివరకు మండలంలో దేవాలయాలకు, పాఠశాలలకు, నిరుపేదలకు, సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రామయ్య, జోగా, తుమ్మల శివ, గార్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వీరపనేని శివాజీ 5వ వర్ధంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -

 
                                    