Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా వీరపనేని శివాజీ 78వ జన్మదిన వేడుకలు

ఘనంగా వీరపనేని శివాజీ 78వ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండల ఏర్పాటు ప్రదాత వీరపనేని శివాజీ 78వ జన్మదిన వేడుకలను శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. 163 వ జాతీయ రహదారి వెంట బస్టాండ్ ఆవరణలో గల, శివాజీ  విగ్రహం వద్ద, అత్యంత సన్నిహితులు, సూరపనేని నాగేశ్వరరావు, తలసిల వెంకన్న, సురవరపు వెంకటరామయ్యలు పూలమాలలు వేసి, గ్రామానికి శివాజీ  చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో విద్యార్థులకు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు , శివాజీ  గ్రామానికి చేసిన సేవలు గురించి  పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కొర్ర రఘురాం  వివరించారు. మండలం ఏర్పడడానికి ప్రధాన కారణం శివాజీ అని, వందలాది ఇండ్లతో నిర్మించిన తారకరామా కాలనీ గ్రామానికి తెచ్చిన ఘనత శివాజీ కి దక్కిందని అన్నారు. శివాజీ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు ప్రతి సంవత్సరం వందలాది మంది పేద వారికి చలికి తట్టుకునే విధంగా కంబల్లు పంపిణీ చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాచినేని సాంబయ్య, జోగా, పెండెం హేమాద్రి, వడ్లమూడి భాస్కరరావు, తుమ్మల శివ  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -