Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనాలు సీజ్ 

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనాలు సీజ్ 

- Advertisement -

హెల్మెట్ తప్పనిసరిగాధరించాలని ఎస్సై మహేందర్ 
నవతెలంగాణ – పెద్దకోడప్ గల్
: పెద్దకొడప్ గల్ మండలంలోని అంజనీ గేట్ జాతీయ రహదారి 161పై గురువారం రోజున ఎస్సై మహేందర్ వాహనాలు తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధన ఉల్లంగించి, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై వాహనాల సంఖ్య పెరుగుతుందని, రద్దిగా ఉండే సమయంలో మద్యంతాగి వాహనాలు నడపడరాదని అన్నారు. దీనివల్ల ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.

వారంరోజులు హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా నిర్వహించినట్లు తెలిపారు. వాహనాలు నడిపే ప్రజలు రోడ్డు నిబంధన, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడకం,18సంవత్సరాలలోపు(మైనార్టీలు)వాహనం నడపడం, రిజిస్ట్రేషన్ సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వారి డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వెంకటేష్, రవి, రమేష్, జైల్ సింగ్, హోంగార్డ్ శ్రీనివాస్, లాల్ సింగ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -