నవతెలంగాణ – వెల్దండ
ఆదిత్య సంస్కృతి మాస పత్రిక వారిచే మధ్యప్రదేశ్ లోని దతియాలో జరిగిన అఖిల భారతీయ సాహిత్యకార్ సమ్మేళనంలో వెల్దండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో హిందీ ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్న కమలేకర్ నాగేశ్వర్ రావుకు సీతాకిశోర్ ఖరే స్మారక సాహిత్య సదక్ పురస్కారం అందుకున్నారు. సెప్టెంబర్ 14న జరిపే జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ మహోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దాదాపు 19 రాష్ట్రాల సాహితీకారులతో జరిగిన కవి సమ్మేళనంలో కమలేకర్ నాగేశ్వర్ రావు పాల్గొని కవిత వినిపించి అందరి మన్ననలు పొంది మధ్యప్రదేశ్ మాజీ హోం శాఖా మంత్రి నరోత్తం మిశ్రా, ఆదిత్య సంస్కృతి పత్రికా సంపాదకులు జగత్ శర్మ, మధ్యప్రదేశ్ సాహిత్య అకాడమీ డైరెక్టర్ వికాస్ దవే ల చే డా.సీతాకిశోర్ ఖరే స్మారక సాహిత్య సాధక్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వెల్దండ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్,ఉపాధ్యాయులు , విద్యార్థులు అభినందించారు.
వెల్దండ హిందీ ఉపాధ్యాయుడికి సీతాకిశోర్ ఖరే స్మారక సాహిత్య సాధక్ పురస్కారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES