జన్మదిన వేడుకను పురస్కరించుకొని మహా అన్నదానం
ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత వేం నరేందర్ రెడ్డి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ప్రభుత్వ సీఎం సలహాదారుడు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి 66వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి తెలిపారు. మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ అధ్యక్షతన కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్ లతో కలిసి శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత అంటేనే వేం నరేందర్ రెడ్డి అని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధులను కేటాయించి ఎంతో అభివృద్ధి చేస్తున్న వ్యక్తి వేం నరేందర్ రెడ్డి అని అన్నారు.
అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను నిర్వహించడం ఈ ప్రాంతంలో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ జన్మదిన వేడుకను నిర్వహించుకుంటున్న విశ్రాంతిభవనం శిథిల వ్యవస్థలో ఉన్నందున మా ప్రాంతానికి నూతన విశ్రాంతి భవనం ఏర్పాటు కావాలని కోరిన వెంటనే సీఎం వద్ద నుండి మంజూరు చేయించి ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న వ్యక్తి అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న నాయకులు బాలాజీ నాయక్ వలబోజు వెంకటేశ్వర్లు కాసం లక్ష్మారెడ్డి రత్నపురం యాకయ్య మద్ది రాజేష్ పూర్ణ కొమురెల్లి నరసయ్య మౌనేందర్ హెచ్ అలివేలు గుగులోతు భారతి వివిధ గ్రామాల సర్పంచులు ఏఎంసీ డైరెక్టర్లు గ్రామ శాఖ అధ్యక్షులు జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.



