Wednesday, November 5, 2025
E-PAPER
Homeకరీంనగర్రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీకి వేముల తన్వి ఎంపిక

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీకి వేముల తన్వి ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్–14 గర్ల్స్ కబడ్డీ పోటీలు పెద్దపల్లి లో నిర్వహించారు. ఈ పోటీలలో జగిత్యాల బాలికల జట్టు మొదటి స్థానంలో నిలిచింది. బాలుర జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలికల జట్టులో అద్భుత ప్రదర్శన చేసిన మండలంలోని ఇటిక్యాల మోడల్ స్కూల్ విద్యార్థిని వేముల తన్వి ఈనెల 16 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు వి.కిషోర్ కుమార్ తెలిపారు. తన్వి ఎంపికపై ప్రిన్సిపాల్ కొల్లూరి సంతోష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -