• ఆయన లేని లోటు పూడ్చలేనిది
• టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి
నవతెలంగాణ -పెద్దవంగర
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేముల వెంకన్న సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. ఉప్పెరగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేముల వెంకన్న (62) ఇటువంటి గుండె పోటుతో అమెరికాలో మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. పార్టీ బలోపేతానికి వెంకన్న చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆమె వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల నాయకులు రంగు మురళి, పొడిశెట్టి సైదులు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, బోనగిరి లింగమూర్తి, బానోత్ సోమన్న, శోభన్ బాబు, చిలుక సోమయ్య, ఏసయ్య, వెంకన్న, రాము తదితరులు పాల్గొన్నారు.
వేముల వెంకన్న సేవలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



