Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గణపయ్యకు ఘనమైన పూజలు

గణపయ్యకు ఘనమైన పూజలు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
గణపతి నవరాత్రుల సందర్బంగా నగరంలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు హిందూ ధర్మ సంస్కృతి, సంప్రదాయాల ఐక్యతే దేశ సమైక్యతకు మూలం అన్నారు అందులో భాగంగానే ఇందూర్ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. బలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ల స్ఫూర్తితో సనాతన హిందూ ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి యువతి, యువకులు చిన్నారులంతా కలిసి భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువులుగా గర్వించదగ్గ విషయం అన్నారు. అనంతరం పలు మండపాలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బట్టికిరి ఆనంద్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, సతీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad