తగ్గిన పోషకాహార లోపం
కారకస్ : వెనిజులాలో పోషకాహార లోపంతో బాధపడేవారి శాతం గణనీయంగా 11.7 పర్సంటేజ్ పాయింట్లు తగ్గిందని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ ఆహార భద్రత, పోషకాహారం (ఎస్‌ఓఎఫ్‌ఐ)పై నివేదికను గురువారం విడుదల చేశారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆహార భద్రతా రంగంలో వెనిజులా గణనీయమైన పురోగతి సాధించిందని ఎఫ్‌ఎఓ పేర్కొంది. అమెరికా ఆ దేశంపై ఆర్థిక యుద్ధం సాగిస్తున్నప్పటికీ ఈ ప్రగతి సాధ్యమైంది. కేవలం మూడేళ్ళలోనే పోషకాహార లోపం సూచీ వ్యాప్తి (పిఓయు)గణనీయంగా క్షీణించింది. 17.6శాతం నుండి 5.9శాతానికి తగ్గింది. దేశ ప్రజల పోషకాహారం పరిస్థితి బాగా మెరుగుపడినట్టు దీంతో తెలుస్తోంది. 2016, 2024 మధ్య వెనిజులా ప్రభుత్వం అమలు చేసిన విధానం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా వుంది. ఆహార లభ్యతను 500శాతానికి పైగా పెంచారు. రోజుకు ఒకో వ్యక్తికి 1378 గ్రాముల పోషకాహారం అందేలా చూశారు. ఇది అంతర్జాతీయ సగటుకు చాలా దగ్గరగా వుంది. ప్రభుత్వం సాధించిన ఈ ఘనతకు చారిత్రక పునాది హ్యుగో చావెజ్ హయాంలో పడింది. ఆకలిని రూపుమాపడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారింది. ఆ సమయంలో అనుసరించిన విధానాలు అంతర్జాతీయ ఆకలి మ్యాప్ నుంచి వెనిజులాను తొలగించేలా చేశాయి. అయితే 9ఏళ్ళ తర్వాత అమెరికా దాని మిత్రపక్షాలు ఏకపక్షంగా అమలు చేసిన ఆంక్షలు మళ్లీ ఆ సమస్యను తెరపైకి వచ్చేలా చేయడంతో ఇటీవలి కాలంలో ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించింది.
ఆహార భద్రతా రంగంలో వెనిజులా గణనీయమైన పురోగతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES