- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రయివేటు కార్యదర్శి (పీఎస్)గా ఎంవీ వెంకట శేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం ఆయన సచివాలయంలోని మంత్రి శ్రీధర్ బాబు కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
- Advertisement -