Saturday, September 13, 2025
E-PAPER
Homeనల్లగొండసీపీఐ మండల కార్యదర్శిగా అన్నేమైన వెంకటేష్ ఏకగ్రీవం

సీపీఐ మండల కార్యదర్శిగా అన్నేమైన వెంకటేష్ ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శిగా మర్యాల గ్రామానికి చెందిన అన్నేమైన వెంకటేష్ ఏడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా చౌదర్ పల్లి గ్రామానికి చెందిన ఎనగంట్ల రాజప్ప ఎన్నికయ్యారు. ఈ మేరకు సీపీఐ మండల 9వ మహాసభ మండల మర్యాల గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజా సమస్యలే ఎజెండగా తీసుకురావాలన్నారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ.. పేద ప్రజల అండగా ఎర్రజెండా ఉంటుందని, అదే మా ఎజెండా అని తెలిపారు. పార్టీ నిర్మాణం కోసం ప్రజాసంఘాల నిర్మాణం కోసం మేమందరం కష్టపడి పనిచేసి పేద ప్రజలకు కష్టజీవులకు కర్షకులకు రైతులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి పోరాడుతామని తెలిపారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు యానాల దామోదర్ రెడ్డి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ , జిల్లా కౌన్సిల్ సభ్యురాలు వడ్లకొండ భారతం, రెడ్యానాయక్ విట్టల్ నాయక్, పల్లపు రాజు, తుమ్మల జ్యోతి ,తుమ్మల గౌతమి,లావణ్య ,కమల బుజ్జి, పాపా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -