వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా సెట్స్‌లో వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి దిగిన ఫొటోను నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ’20 నెలల సుదీర్ఘ విరామం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్ళీ కెమెరా వెనక్కి వచ్చారు. ప్రతి ఒక్కరి అభిమాన కథానాయకుడు వెంకటేష్‌తో చేతులు కలిపారు. ‘ది ఓజీస్’ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ పునరావృతం కానుంది’ అని ట్వీట్‌లో నాగవంశీ పేర్కొన్నారు.
బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరువాత వెంకటేష్ నటిస్తున్న చిత్రమిది. గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ స్క్రిప్ట్, మాటలు అందించారు. దీంతో ఈ తాజా సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, వెంకటేష్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే ‘దృశ్యం 3’తో మరోమారు ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారు.
వెంకీ, త్రివిక్రమ్ సినిమా షురూ..
- Advertisement -
- Advertisement -