చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు వస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తుండగా, అర్చన సమర్పిస్తున్నారు. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ లాంటి లాఫ్ రయాట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరోసారి కూడా వెంకటేష్‌తో అదే మ్యాజిక్ చేయబోతున్నారు. చిరంజీవి, వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు డబుల్ ఫెస్టివల్ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో వెంకటేష్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
గురువారం వెంకీ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చిరు, వెంకీపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చిరంజీవి సంతోషంగా వెంకటేష్‌కి వెల్‌కమ్ చెబుతుండగా, మై బాస్.. అంటూ చిరుని వెెంకటేష్ స్నేహంగా పలకరిస్తూ కనిపించారు. సెట్‌లో పండగ వాతావరణం స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. నయనతార, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – భీమ్స్ సిసిరోలియో, డీవోపీ – సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి.
చిరు సినిమాలో వెంకీమామ..
- Advertisement -
- Advertisement -



