అనుమతి రద్దు చేయాలని కౌన్సిలర్ల డిమాండ్
నవతెలంగాణ – బాన్సువాడ (నసరుల్లాబాద్)
దళారులు ప్రభుత్వ భూములు కబ్జా పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తున్నారని, గతంలో వెంచర్లకు అనుమతి ఇచ్చిన దానికి రద్దు చేసి విచారణ చేపట్టాలని బాన్సువాడ మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కౌన్సిలర్లు పిర్యాదు చేశారు. సోమవారం బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారి లేక పోవడంతో కింది స్థాయి అధికారిణికి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో కొంతమంది పెట్టుబడిదారులు బాన్సువాడ పట్టణంలో కొందరు వెంచర్లు నిర్వహిస్తున్నారు.
ఇందులో ఒకరు రెండు ఎకరాలు పట్టాతో పాటు దాని పక్కన ప్రభుత్వ భూమిని కలుపు కొనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అక్రమంగా ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్స్ చేసి విక్రహిస్తున్నట్లు ఆరోపించారు. అక్రమ ధ్రువ పత్రాలు సృష్టించి ప్లాట్స్ విక్రయాలు చేస్తున్నారనీ ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని అన్నారు. అధికారులు తేరుకునేలోపు ఆక్రమించిన స్థలాల్లో భవంతులు వెలుస్తున్నాయి. బాన్సువాడలో ఎన్ని అయితే వెంచర్లు ఉన్నాయో ఫైనల్ పర్మిషన్ వచ్చిందాకా ఎలాంటి అనుమతిఇవ్వద్దని, గతంలో ఇచ్చిన అనుమతి రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లుఅంజుం బేగం ఖలీల్, ఫిరోజ్ , మాక్బూల్ నాయకులు ఖలీల్ మాజీ కౌన్సిలర్ బాడీ శీను జావిద్ తదిదారులు పాల్గొన్నారు.



