నవతెలంగాణ-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటు నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనీ, దీనిపై నిగ్గు తేల్చాలని కోరుతూ రాష్ట్రం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను సవాలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు చెప్పనుంది. కమిషన్ నియామకం, రిపోర్టులను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ స్మితసభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్‌కే జోషి విడివిడిగా పిటిషన్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో లోపాలపై సుప్రీం కోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పీసీ.ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు, కమిషన్ రిపోర్టు చెల్లదనే పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ వెలువరించబోయే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
నేడు జస్టిస్ ఘోష్ కమిషన్‌పై తీర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



