- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు సతీష్ షా (74) శనివారం కన్నుమూశారు. సరాభాయి వర్సెస్ సరాభాయి, మైన్ హూన్ నా వంటి చిత్రాల్లో తన అద్భుత నటనతో గుర్తింపు పొందిన ఆయన, కిడ్నీ వైఫల్యంతో మృతి చెందారని సిన్టా (CINTAA) అధికార ప్రతినిధి అశోక్ పండిట్ తెలిపారు. “మన ప్రియమైన స్నేహితుడు, గొప్ప నటుడు సతీష్ షా ఇక లేరు. కొన్ని గంటల క్రితం కిడ్నీ వైఫల్యంతో ఆయన మరణించారు. హిందూజా ఆసుపత్రిలో చివరి శ్వాస విడిచారు. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. ఓం శాంతి” అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
- Advertisement -



