Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వపూర్‌లో పశువైద్య శిబిరం

బస్వపూర్‌లో పశువైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం బస్వపూర్ (మేడిపల్లి) గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ ధీరజ్, డాక్టర్ రమేష్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులు పశు ఆరోగ్య శిబిరాలు, గోపాలమిత్ర సేవలు వినియోగించుకోవాలని, కృత్రిమ గర్భధారణతో మెరుగైన జాతి ఆడ దూడలు పుడుతాయని సూచించారు. దూడ పుట్టిన వెంటనే జున్ను పాలు త్రాగించడం, 24 గంటల్లో టీటీ ఇంజక్షన్ వేయించాలని సూచించారు.

ఈ శిబిరంలో 52 పశువులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పవిత్ర దేవేందర్, ఉపసర్పంచ్ రెడ్డి అనిల్, పశు వైద్య సిబ్బంది, గోపాలమిత్రులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -