– సర్పంచ్ కూరాకుల శిరీష
నవతెలంగాణ – బల్మూరు
రైతులు పశువులు గొర్లు మేకలు వంటి వాటికి పశు వైద్య అధికారుల సేవలు సద్వినియోగం చేసుకోవాలని బల్మూరు గ్రామ సర్పంచ్ కూరాకుల శిరీష అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గొర్రెలు మేకల నట్టల నివారణ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పశు వైద్య అధికారులు రైతులకు అందుబాటులో ఉండి రైతుల యొక్క పశువుల మరియు గొర్రెల మేకలకు సంబంధించి వ్యాధి నివారణ చర్యలకు సూచనలు ఇవ్వాలని అన్నారు. పశువైద్య అధికారి అనిల్ మాట్లాడుతూ గత నెల రోజులుగా గ్రామాలలో నట్టల నివారణ ఉచిత పంపిణీ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని దాదాపుగా అన్ని గ్రామాలు పూర్తి అయ్యాయని తెలిపారు. రైతులకు సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసి వ్యాధి నివారణ చేసుకోవాలని కోరారు. శిబిరంలో గొర్రెలు మరియు మేకలకు నట్టల నివారణ మందులు తాగించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ ,డాక్టర్ మహేశ్వరి , కార్యదర్శి లక్ష్మణ్ వార్డు సభ్యులు , శివశంకర్, మహేష్ పారావేటర్నరీ సిబ్బంది నగేష్ కిషోర్, మంజు, వెంకటయ్య, మధు రైతులు పాల్గొన్నారు.
పశువైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



